Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాలో పార్టీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటలకు బరిపాడలోని ఛౌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు బాలాసోర్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రపరాలో జరిగే బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రచారం చేయనున్నారు. మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఖుషీనగర్‌, డియోరియా, గోరఖ్‌పూర్‌లో పార్టీ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు.

ఉదయం 11:30 గంటలకు ఖుషీనగర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదిత్యనాథ్‌ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు డియోరియాకు చెందిన బాబా రాఘవదాస్ ఇంటర్ కళాశాలలోని భట్‌పరాని మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక, చివరగా మధ్యాహ్నం 1:50 నిమిషాలకు గోరఖ్‌పూర్‌లోని మురారీ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:50 నిమిషాలకు గోరఖ్‌పూర్‌లోని బన్స్‌గావ్‌లోని సర్వోదయ ఇంటర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

RSS
Follow by Email
Latest news