Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పుష్ప-2 మూవీ లిరికల్ సాంగ్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ నుంచి బుధవారం ఒక లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘‘పుష్ప పుష్ప..’’ సాంగ్‌ను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేసింది. ‘పుష్ప’ రాకను ‘‘పుష్ప పుష్ప…’’ జపంతో సెలబ్రేట్ చేసుకోండి’ అనే క్యాప్షన్‌తో సాయంత్రం 5.05 నిమిషాలకు చిత్రయూనిట్ ఈ పాటను విడుదల చేసింది.

 

ఈ సాంగ్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. లిరికల్ వీడియోలో మధ్య మధ్యలో కనిపిస్తున్న అల్లు అర్జున్ స్టిల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. కాగా సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్, రస్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్‌‌తో పలువురు అగ్రనటులు ఉన్నాయి.

RSS
Follow by Email
Latest news