వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఊర మాస్ అనిపించాయి. అయితే.. ఇందులో కథేం రివీల్ చేయలేదు. కనీసం ప్లాట్ ఏమిటన్నది కూడా చెప్పలేదు. కాన్సెప్ట్ ఏంటనేది కూడా బయటకు రాలేదు. ట్రైలర్ చూస్తే సగం సినిమా అర్ధం అవుతుంది. అది ఎలా ఉంటుందో కొంత వరకు గెస్ చేయవచ్చు. కానీ ఇందులో ఆలా జరగలేదు. దర్శకుడు ఇది కావాలని వేసిన ఎత్తుగడ అంటున్నారు. సినిమాలో కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నారు. కానీ వాటిని అలానే దాచి పెట్టారు. ఇక, ఈ చిత్రానికి హరీశ్ జయరాజ్ మంచి సంగీతాన్ని అందించారు. దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నారు.