ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు పాటు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు ఒప్పందాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వంవహిస్తున్న ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ పొడిగింపు అమలులో ఉన్న రోజులు అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా మరో 33 మంది ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.