- సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం
- హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్
- వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్.
నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు, రోడ్లన్నీ మూగబోనున్నాయి. గత కొన్ని రోజులుగా హోరెత్తించిన ప్రచారాలకు నేటితో తెరపడనుంది. దింతో చివరి రోజున అన్ని ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వివిధ పార్టీల నాయకుల చివరి రోజు ప్రచారం :
కాంగ్రెస్ :
- రాహుల్ గాంధీ – హైదరాబాద్ జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగులు
- ప్రియాంకాగాంధీ – జహీరాబాద్
- రేవంత్ రెడ్డి – కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్
బీ ఆర్ ఎస్ :
- కేసీఆర్ – వరంగల్, గజ్వేల్
- హరీశ్ రావు – సిద్ధిపేట, చేగుంట
బిజెపి, జనసేన :
- పవన్ కల్యాణ్ – బాలానగర్ క్రాస్ రోడ్స్ నుంచి హస్మత్ పేట్ వరకు రోడ్ షో
- దేవేంద్ర ఫడ్నవిస్ – దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట
- ఏక్ నాథ్ షిండే – ఆదిలాబాద్, ధర్మపురి.