వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. విమానాల్లో బ్లాక్ బాక్స్ ను ఉపయోగించడం, ఓడలకు ఆరెంజ్ కలర్ వేయడం వెనుక ఇవే కారణాలను పేర్కొన్నారు. జాతీయ విపత్తు స్పందన దళం వినియోగించే రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లకు సైతం ఆరెంజ్ కలర్ ఉంటుందని గుర్తు చేశారు. వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి తెలిపారు.