– రేపు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్…
తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్ చేతులమీదుగా రేపు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం కొసం ..దసరా కానుకగా, అక్టోబర్ 6వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని శుక్రవారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందివ్వనున్నారు.