బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో డిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. అందులోభాగంగా ఆయనకు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, గోవా రాష్ట్రాల బాధ్యతలు ఆయనకు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జిగా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయన పని చేయనున్నారు.
21న ఏపీలో మీటింగ్
ఈనెల 21న బండి సంజయ్ ఏపీలోని ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వారికి ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణలో చేపట్టే రథయాత్రలో సైతం బండి పాల్గొననున్నారు. తెలంగాణలో పార్టీకి ఎలాగైతే మైలేజి తెచ్చారో అలాగే ఏపీలో పార్టీకి మైలేజ్ తెచ్చే అవకాశం ఉందని భావించి బండిని పంపించనున్నట్లు సమాచారం.