దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఇందులో ముగ్గురు డీఐజీ స్థాయి మహిళా అధికారులు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు అంతా మహిళలే కావడం విశేషం. 16 మంది ఇన్‌స్పెక్టర్లు,10 మంది ఎస్సైలతో సీబీఐ బృందాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ డైరెక్టర్(జేడీ) ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు ఈబృందం నివేదికలు సమర్పించనుంది.