మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు పడి, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన రాహుల్ గాంధీ కి ఊరట లభించింది.ఈక్రమంలో ఆగస్టు 7న ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధించారు. తాజాగా అయనను డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బుధవారం నాడు నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్ సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు.