స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఆ పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.13,000 కోట్లను కేటాయించినట్లు అయన వివరించారు. ఈ పథకం కింద మొదటి విడతలో 5% వడ్డీతో రూ.1లక్ష రుణం ఇవ్వబడుతుంది. రెండో విడత కింద మరో రూ.1లక్షను 5%వడ్డీ రాయితీతో అందిచనున్నట్లు మంత్రి అశ్విన్ వివరించారు.