ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంజిత్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. రాక్ (ఢిల్లీ ) సంస్థ వారు శత వరల్డ్ రికార్డును ఆయనకు అందచేశారు. పింగళి వెంకయ్య కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆయనను ఘనంగా సన్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా డాక్టర్ రంజిత్ కు శత వరల్డ్ రికార్డ్ ప్రేమ్ ను అందచేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానం చేసినించారు.
ఈసందర్బంగా వేణుగోపాల చారి మాట్లాడుతూ… ఈ వందనాలు రికార్డ్ లకు డాక్టర్ రంజిత్ అర్హులని పేర్కొన్నారు. అయన కొన్ని వందల కార్యమాలు చేసారని కొనియాడారు. అలాగే కళా రంగానికి రంజిత్ విశిష్ట సేవలు అందించారని సముద్రాల తెలిపారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిధి విశ్రాంత జడ్జి బూర్గుల మధుసూదన్, రంజిత్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గా లయన్ చిల్లా రాజశేఖరరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమం లో కల్లూరి హరి కృష్ణ,కరుణా సాగర్,రమేష్, తురగా సూర్యారావు, ప్రసన్న,నాట్యగురువులు,తదితరులు పాల్గొన్నారు.