ఇటీవలే చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది. ఈ ప్రయోగం ద్వారా 422 కిలోల బరువు కలిగిన సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అన్ని దశలను అననుసంధానం చేసి పూర్తి స్థాయి రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ వద్దకు చేర్చారు. రాకెట్ శిఖర భాగాన ఏడు శాటిలైట్లను అమర్చి, హీట్ షీల్డ్స్ ను క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. రేపు ఉదయం 6.30 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించబోతున్నారు.