Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నారా లోకేశ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన భువనేశ్వరి

ఈరోజు ఒక గొప్ప దినం. అదే (మదర్స్ డే) మాతృ దినోత్సవం. ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మలేనిదే జననం లేదు… గమనం లేదు… అమ్మే లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు… అసలు మనుగడనే లేదు. అంత గొప్ప మాతృమూర్తి మన అమ్మ. అలంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే. ఆమె త్యాగాలను వెల కట్టలేము. అంత గొప్ప మనసున్న అమ్మకు శతకోటి వందనాలు.

ఇక, ఇలాంటి గొప్ప దినం రోజున  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు అయన తల్లి భువనేశ్వరి. ఎక్కడ ఉన్నా ప్రతి ఏటా మదర్స్ డే రోజున అమ్మను కలిసి ఆమెతో ఆనందాన్ని పంచుకుంటుంటారు. అయితే, ఈ యేడాది జనవరిలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఉన్నందున
ఈ రోజున తన తల్లిని స్వయంగా కలవడం కుదరకపోవడంతో… ఉదయాన్నే తన తల్లి భువనేశ్వరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు కృతజ్జతలు చెప్పుకున్నారు.

అయితే ఊహించని రీతిలో మదర్స్ డే రోజు లోకేశ్ ను తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ చేశారు. లోకేశ్ ఇవాళ 99వ రోజు పాదయాత్ర ముగించుకొని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరగానే తల్లి నారా భువనేశ్వరి కన్పించింది. తల్లిని చూడగానే లోకేశ్ ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి. ఇకపోతే,  సోమవారం యువగళం పాదయాత్రకు 100వ రోజు కాగా, పాదయాత్రలో లోకేశ్ తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులు కలిసి నడవబోతున్నారు.

యువగళం 100వ రోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఆ టీమ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తన భర్త చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని నారాభువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి సోమవారం అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

RSS
Follow by Email
Latest news