కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటిపోయి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 131 స్థానాలు చేజిక్కించుకుంది. మరో 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ 64 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జనతాదళ్ (ఎస్) 19 స్థానాల్లో గెలిచి, ఒక చోట ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు. ఈసారి తమదే విజయం అని ఆత్మ విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.