Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి… అప్రమత్తమైన కేంద్రం

కరోనా సంక్షోభం నుంచి జనం మరచిపోయారో లేదో… మరో వైరస్ జనాలను కలవరం పెట్టిస్తుంది. గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దేశంలో అధికమైంది.  ఇద్దరు మరణించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్3ఎన్2… ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్ భారత్ కు కొత్తకాదని, దేశంలో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు దీని వ్యాప్తి కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది.

ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఈ హెచ్3ఎన్3 వైరస్ కు త్వరగా గురవుతారని వెల్లడించింది. కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, మార్చి చివరి కల్లా హెచ్3ఎన్2 కేసులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తాజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

RSS
Follow by Email
Latest news