తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు కల్ప వృక్ష వాహనం, సాయంత్రం ఆరు నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. చివరగా చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి.