గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరాయింపు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొదటి దశ పోలింగ్ లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో విస్తరించిన 89 స్ధానాల్లో తొలి విడత పోలింగ్ ముగిసింది.
గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది. తోలి దశ 89 స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. ఆప్ 88 చోట్ల బరిలోకి దిగింది. మొత్తం 39 పార్టీలు బరిలో నిలిచాయి. 339 మంది స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నారు. 2017లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి 40 స్థానాలను గెలుచుకోగా.. స్వతంత్రుడు ఒక చోట గెలిచారు.