జమ్మూలో గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీని ప్రారంభించారు, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు.
ఈరోజు విలేకరుల సమావేశంలో తన పార్టీ పేరును ప్రకటించారు. “డెమొక్రటిక్ ఆజాద్” పార్టీ పేరుతో ఈరోజు నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈసందర్బంగా అయన మాట్లాడుతూ… తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని అన్నారు. తమ పార్టీ పేరు కోసం 1500 పేర్లను పలువురు సూచించారని, ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్రతలను ప్రతిబింబించే పేరు పెట్టాలని తాము కసరత్తు సాగించామని అయన వివరించారు.