Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ ఇక లేరు..

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి.

విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు..:

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కృష్ణంరాజుకు 1996లో నవంబరు 21న వివాహం జరిగింది.

చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు దీటుగా తనదైన నటనతో  కృష్ణంరాజు రాణించాడు.

1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా వచ్చాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. అవే కళ్లు అనే చిత్రం ద్వారా విలన్ గా కూడా కృష్ణంరాజు నటించారు.

RSS
Follow by Email
Latest news