బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఆయనకు కొన్ని అసాధారణమైన అధికారాలు దక్కనున్నాయి. రాజుగా పరిపాలన సాగించినంత కాలం ఆయనకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. పాస్‌పోర్ట్ లేకుండానే ఎక్కడికైనా వెళ్లవచ్చు. అదేవిధంగా దేశీయంగా లైసెన్స్ అవసరం లేకుండానే కారులో ప్రయాణం చేయవచ్చు. ఎవరూ ఆయన్ను ఆపి ప్రశ్నించే అధికారం ఉండదు.
ఆయనకు అధికారికంగా వచ్చే ఆస్తులు…
బ్రిటన్, వేల్స్ లోని బహిరంగ ప్రదేశాల్లోని చెరువుల్లో ఉండే హంసలు, బ్రిటన్ సముద్ర జాలాల్లో ఉండే స్టర్జన్ లు, డాల్ఫిన్‌లు, తిమింగళాలు రాజుకు ఆస్తులుగా మారిపోతాయి. వీటిని ఎవరైనా వేటాడితే వారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. 14 కామన్‌వెల్త్ దేశాలకు చార్లెస్ 3 రాజుగా వ్యవహరించనున్నారు.
కోల్పోనున్న హక్కు :
రాజు హోదాలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటువేసే అధికారం ఉండదు. రాజకీయాల విషయంలో తటస్థంగా ఉండాల్సి ఉంటుంది.