Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

🌺 చరిత్రలో ఈరోజు సెప్టెంబరు 02న 🌺

🎂 జననాలు 🎂

1838: భక్తివినోద ఠాకూర్, హిందూ తత్వవేత్త, గురువు, గౌడియ వైష్ణవం యొక్క ఆధ్యాత్మిక సంస్కర్త.

1885: టికే మాధవన్, భారతీయ సంఘ సంస్కర్త, పాత్రికేయులు, విప్లవకారులు.

1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితులు.

1924: స్వరూపానంద సరస్వతి, భారతీయ మత నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు.

1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)

1929: గౌర్ గోవింద స్వామి వైష్ణవ మత నాయకులు.

1942: బాడిగ రామకృష్ణ, 14వ లోక్‌సభ సభ్యులు.

1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)

1941: సాధనా శివదాసాని, భారతీయ చలనచిత్ర నటి. 1960లు మరియు 70లలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించిన నటీమణి.

1948: క్రిస్టా కొరిగన్ మెక్అలిఫ్, అంతరిక్షంలో మొదటి ప్రైవేట్ పౌరురాలుగా ఎంపిక చేయబడిన అమెరికన్ ఉపాధ్యాయురాలు. 1986లో స్పేస్ షటిల్ ఛాలెంజర్ పైకెళ్లిన కొద్దిసేపటికే పేలడంతో ఆమె మరియు మరో ఆరుగురు సిబ్బంది మరణించారు.

1950: శోవన నారాయణ్, భారతీయ కథక్ నర్తకి.

1953: బి. రవి పిళ్లై, భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త.

1956: రాజ్ ఖురానా, పంజాబ్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్త, సోషలిస్ట్.

1956: నందమూరి హరికృష్ణ, చలనచిత్ర నటులు, నిర్మాత. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు కుమారులు (మ. 2018).

1965: సురేఖ యాదవ్, భారతీయ రైల్వేలకు మొట్టమొదటి మహిళా లోకోపైలట్.

1971: పవన్ కళ్యాణ్, భారతీయ చలనచిత్ర నటులు, నిర్మాత, దర్శకులు. జనసేన పార్టీ అధినేత.

1971:-తోచి రైనా, నేపథ్య గాయకులు, స్వరకర్త, తత్వవేత్త.

1973: సుదీప్, భారతీయ చలనచిత్ర నటులు, దర్శకులు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ వ్యాఖ్యాత, గాయకులు, ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలలో పనిచేస్తున్నారు.

1981: దివ్య ఉన్ని, భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం వంటి వివిధ రకాల నృత్యాలను బోధించే భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి.

1984: రేవంత సారాభాయ్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భారతీయ చలనచిత్ర మరియు రంగస్థల నటులు, నర్తకి, కొరియోగ్రాఫర్.

1984: గౌరవ్ తివారీ, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, UFO ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, భారతదేశంలో పారానెక్సస్ ప్రతినిధి

1988: ఇషాంత్ శర్మ, టెస్టులు, ODIలు, T20I లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత క్రికెటర్.

💥 మరణాలు 💥

1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారులు (జ.1892).

1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).

2002: ఇషాక్ బక్స్, భారతీయ నటులు.

2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకులు. (జ.1949).

2011: శ్రీనివాస్ ఖలే, మహారాష్ట్రకు చెందిన భారతీయ స్వరకర్త,సంగీత దర్శకులు.

2011: నండూరి రామమోహనరావు తెలుగు రచయిత, పాత్రికేయులు.

💫 సంఘటనలు 💫

31 క్రీ.పూ: ఆక్టియం యుద్ధంలో ఆగస్టస్ సీజర్, మార్క్ ఆంటోనీపై నిర్ణయాత్మక విజయం సాధించారు.

1573: అక్బర్, అహ్మదాబాద్ సమీపంలో నిర్ణయాత్మక యుద్ధంలో గెలిచి గుజరాత్‌ను స్వాధీనం చేసుకున్నారు.

1666: లండన్ రాజు బేకర్ ఇంట్లో అనుకోకుండా నిప్పు అంటుకుని కాలిపోవడం ప్రారంభమైంది. అది నగరం మొత్తం వ్యాపించింది. పాత సెయింట్ పాల్స్ కేథడ్రల్ మరియు దాదాపు 13,000 ఇళ్ళు సహా నగరంలోని చాలా భాగాన్ని నాశనం చేసింది. దీనికి “గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్” అనే పేరును నామకరణం చేశారు.

1859: సౌర సూపర్ తుఫాను విద్యుత్ టెలిగ్రాఫ్ సేవను ప్రభావితం చేసింది.

1945: హోచిమిన్, వియత్నాంను ఫ్రాన్స్ నుండి స్వతంత్రంగా ప్రకటించారు.

1945: జపాన్ విదేశాంగ మంత్రి షిగెమిట్సు మమోరు మరియు జనరల్ ఉమేజు యోషిజిరో కలిసి USS మిస్సౌరీలో జపాన్ అధికారిక లొంగుబాటుపై సంతకం చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం(1939-1945) ముగిసింది.

1946: భారతలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వం భారత రాజ్యాంగ సభ నుండి ఏర్పడింది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ చేస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది. కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.

1958: జాతీయ రక్షణ విద్యా చట్టంపై సంతకం చేయబడింది.

1970: కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌ను రాష్ట్రపతి వి.వి.గిరి ప్రారంభించారు.

1998: పైలట్ రహిత శిక్షణ విమానం నిశాంత్ ను విజయవంతంగా ఎగురవేయబడింది.

1998: స్విస్ ఎయిర్ ఫ్లైట్ 111 నోవా స్కోటియా , కెనడా తీరంలో కూలిపోయింది, అందులో ఉన్న మొత్తం 229 మంది మరణించారు. విమానంలో మండే ఇన్సులేషన్‌కు మంటలు వ్యాపించడానికి లోపభూయిష్ట వైర్లు కారణమని తరువాత నిర్ధారించబడింది.

2012: నిర్మల్ లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.

2016: అనేక ఊహాగానాల తరువాత, ఉజ్బెకిస్తాన్ మొదటి అధ్యక్షులు ఇస్లాం కరిమోవ్ మరణం అధికారికంగా ప్రకటించబడింది.

🪴 పండుగలు, జాతీయ దినాలు 🪴

ప్రపంచ కొబ్బరి దినోత్సవం/ కొబ్బరికాయల దినోత్సవం:

RSS
Follow by Email
Latest news