Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీకి గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ మంగళవారం లేఖ రాశారు.

కాకినాడ గోదావరి జిల్లాలోని కేపీ పురంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.  ఈ మేరకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఏపీకి లేఖ రాసింది.  కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమల్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావించారు.

బల్క్ డ్రగ్ పార్కుల ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం గ్రాంటు అందజేస్తుందన్నారు. ఈ పార్క్ ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

 

 

RSS
Follow by Email
Latest news