ఇండియాలో మరో కొత్త వైరస్ టెన్షన్ పుట్టిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయింది. దీనినే మంకీపాక్స్ వైరస్ గా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.ఈ నెల 12న యూఏఈ నుంచి కేరళ చేరుకున్న ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు.
అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపగా, నిన్న సాయంత్రం ఫలితాల నివేదిక వచ్చింది. అందులో అతడికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంకీపాక్స్ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యున్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ టీంను కేరళకు పంపింది.