Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేడే పాలిసెట్‌ రిజల్ట్స్..

పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (పాలిసెట్‌–2022) ఫలితాలు బుధవారం రోజున వెల్లడించనున్నట్లు పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అయన తెలిపారు. గత జూన్ 30వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్‌ పరీక్షను నిర్వహించగా లక్ష మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా.. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ డిప్లొమా సీట్లను పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు.

ఒక్కొక్కరికి రెండు  ర్యాంకులు..

పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ఈ సారి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇందులో ఒకటి టెక్నికల్‌ పాలిటెక్నిక్ ర్యాంకు, మరొకటి అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా ర్యాంకులు గా విడివిడిగా ప్రకటించనున్నారు.

  • రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్, కంప్యూటర్ సంబంధిత కోర్సుల దాకా పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు కోర్సుల కాల వ్యవధి మూడేళ్లు కాగా.. కొన్నింటికి మూడున్నరేళ్ల కాల వ్యవధి ఉంటుంది.
  • పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చాలా వరకు ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్టులు ఉంటాయి. అందువల్ల పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఈసెట్ పరీక్ష రాసి నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
  • చాలా వరకు పాలిటెక్నిక్ కోర్సులకు నేరుగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పలు రకాల కంపెనీలు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యత నిస్తున్నాయి.
RSS
Follow by Email
Latest news