జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి న రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ని నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఈరోజు ఉదయం రోహిత్‌కు జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కోవిడ్ పాజిటివ్‌గానే వచ్చిందని ఆయన పేర్కొన్నారు.