Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30 గంటలకి పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక  కేంద్ర మంత్రులు, బిజెపి అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో  హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పటు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలను విడుదల చేశారు.

హైదరాబాద్ లో మోడీ పర్యటన వివరాలు…

జులై 02 న

👉 ప్రధాని మోడీ  జులై 02 న 12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కు బయలుదేరుతారు.
👉 2 .55 బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుండి
👉 3.00కు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో నోవాటెల్ కి వెళతారు.
👉 3.20 HICC నోవాటెల్ కి ప్రధాని చేరుకుంటారు.
👉 3.30 నోవాటెల్ కన్వేషన్ సెంటర్ కి
👉 3.30 నుండి 4 గంటల వరకు రిజర్వ్.
👉 సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ హాజరు కానున్నారు.
👉 రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్.

జులై 03 న

👉 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్నారు.
👉 సాయంత్రం 4. 30 నుండి 5.40 వరకు రిజర్వ్.
👉 సాయంత్రం 5.55 HiCC వద్ద హెలిప్యాడ్ వద్దకు చేరుకుని, అక్కడ నుండి
👉 సాయంత్రం 6.15 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.
👉 6.30 నిమిషాలకి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ కు వస్తారు.
👉 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
👉 రాత్రి 7.35 గంటలకు బహిరంగ సభ నుండి నోవాటెల్ లేదా రాజ్ భవన్ వెళతారు. రాత్రికి అక్కడే మోడీ బస.

జులై 04 న

👉 ఉదయం 9.20కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
👉 బేగంపేట నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళతారు.
👉 10.10 నిమిషాలకు విజయవాడ చేరుకోనున్నారు.
👉 ఇందులో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందంటున్న పోలీసులు. హైదరాబాద్ లో పర్యటన సందర్భంగా.. సోషల్ మీడియాపైన ప్రత్యేక మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆ వింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుందని అయన తెలిపారు.

RSS
Follow by Email
Latest news