Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త్వరలో ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్..!

గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం పలు కొత్త వస్తువులను అందుబాటులోకి తీసుకురానుంది. ఐ/ఓ 2022 పేరిట తన నూతన ఉత్పత్తుల ప్రదర్శన, పరిచయ కార్యక్రమం నిర్వహించనుంది. మే 11, 12 తేదీల్లో గూగుల్ ఐ/ఓ టెక్ ఫెయిర్ జరగనున్న నేపథ్యంలో మరిన్ని వస్తువులను పరిచయం చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా స్మార్ట్ వాచ్ ని విడుదల చేయనుంది. వేర్ ఓఎస్ 3.1 వెర్షన్ తో పిక్సెల్ స్మార్ట్ వాచ్ తీసుకువచ్చేందుకు గూగుల్ తుది సన్నాహాలు చేస్తోంది. నూతన ఉత్పత్తుల ప్రదర్శన లో ఈ స్మార్ట్ వాచ్ ను ప్రపంచానికి అందించనుంది.

అంతేకాకుండా కొత్త ఓఎస్ తో ముస్తాబైన సరికొత్త ఫోన్ ను కూడా అందుబా టులోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ను గూగుల్ పిక్సెల్ 6ఏ పేరిట  విడుదల చేయనుంది. దీంట్లో ప్రధానంగా 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ లో 8 ఎంపీ కెమెరా ఉంటుంది. అయితే, గూగుల్ పిక్సెల్ 6ఏ పేరును గూగుల్ సంస్థ ప్రకటించలేదు కానీ, ఇప్పటికే పిక్సెల్ 5ఏ ఉంది కాబట్టి, తర్వాత వచ్చే మోడల్ 6ఏ అయ్యుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ను కూడా ఆవిష్కరించనుంది. 2021లో ఆండ్రాయిడ్-12 ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆండ్రాయిడ్-13 ఓఎస్ ను ప్రవేశపెడుతోంది. ఇది కేవలం  గూగుల్ పిక్సెల్ ఫోన్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆతరువాత కొద్ది రోజులకు మిగితా అన్ని ఫోన్లలో అందుబాటులోకి రానుంది. కొత్తగా రాబోతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అనేక అప్ డేటెడ్ ఫీచర్లు ఉన్నట్టు సమాచారం.

RSS
Follow by Email
Latest news