Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కోరిన కోర్కెలు నెరవేరుస్తూ… విరాజిల్లుతున్న స్వయంభు స్వేతార్క మూలగనపతి…

భక్తులు కోరిన  కోర్కెలను నెరవేరుస్తూ.. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నదేవాలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో దేవుని విగ్రహం ఏ శిల్పి చిక్కింది కాదు. స్వయంభు అనగా స్వయంగా వెలసిన విగ్రహం. శ్వేత అనగా… తెల్లని, అర్కము అనగా… జిల్లేడు, మూలము అనగా… వేరు. అంటే…? ఒక తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుండి ఉద్భవించిన గణపతి, అందుకే శ్వేతార్క మూల గణపతి గా వెలసిల్లుతున్నాడు. ఒక తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత ఆ చెట్టు వేరులో నుండి గణపతి ఆకృతిలో ఏర్పడుతుందని పురాణ గ్రంధాల్లో తెలియ పరచడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిందే ఈ ఆలయం. స్వామి వారి తలా భాగం, కళ్ళు, నుదురు, దంతాలు, పాదాలు, చేతులు ఇలా అన్ని నేచురల్ గా వెలసిన భగవంతుడే ఏ స్వయంభు మూలా గణపతి.

ఆలయ ప్రత్యేకత :

శ్వేతార్క మూలా గణపతి స్వామి వారు తూర్పు ముఖంగా ఉండి, ఈశాన్యం వైపుకు కైలాసం చేస్తున్నట్లుగా స్వామి వారు ఉండడం తో… స్వామి వారిని దర్శించుకున్నచొ సకల దోషాలు హరించుకు పోతాయని, అలాగే వాస్తు దోషం కూడా తొలగిపోతుందనేది నానుడి. చదువు, ఉద్యోగం, విదేశీయానం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఇలా అనేక సమస్యలతో వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని, ఈ ఆలయానికి వచ్చే భక్తులు చెపుతున్న మాట. విదేశీయులు సైతం ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం మరో ప్రతేకత.

ప్రతి నెల మొదటి మంగళవారం ప్రత్యేక హోమం :

ప్రతి మంగళవారం గణపతి హోమం చేస్తారు. కానీ ప్రతి నెల మొదటి మంగళవారం చేసే గణపతి హోమం కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున స్వామి వారి హోమం నిర్వహించిన అనంతరం గరిక పూజ నిర్వహిస్తారు. గణపతి స్వామి వారికీ అత్యంత ప్రీతి కరమైన పూజ గరిక పూజ. అందుకే.. ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులు సైతం పూలు పండ్లు కాకుండా గరికను చిన్న చిన్న కట్టలుగా కట్టి తీసుకు వస్తారు. ఆలా తీసుకు వచ్చిన గరిక టోన్ స్వామి వారికీ పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం గణపతి పూజ అనంతరం భక్తులు అందరికి ఉచిత  అన్నదానం కార్యక్రమం ఉంటుంది.

శిల లేని…శిల్పి చెక్కని రూపం :

ఈ ఆలయంలో దేవతామూర్తికి ఎలాంటి శిలా రూపం మనకు కనబడదు. స్వయంగా వినాయకుడే వెలిసిన ఆలయం. ఒక తెల్ల జిల్లేడు చెట్టు వేరులో నుండి గణపతి ఆకృతిలో వెలసిన దేవుడు. ఆలా వెలసిన దేవతామూర్తికి పద్దెనిమిదిన్నర కిలోల వెండితో స్వామివారి కవచాన్ని చేయించారు. ఐదుగురు పీఠాధిపతులతో ఈ కవచాన్ని స్థిరప్రతిష్ఠ చేయడం జరిగింది.

ఎలా చేరుకోవాలి..: 

ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలిపే ప్రధాన రైల్వే జంక్షన్ కాజిపేట. దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. కాజిపేట జంక్షన్ లో దిగి, స్టేషన్ బయటకి రాగానే ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ దాటిన తరువాత, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అక్కడ  కుడివైపున రెండవ అడ్డా రోడ్డులోకి రాగానే ఈ ఆలయం ఉంటుంది.

 

 

RSS
Follow by Email
Latest news