కరోనా కేసులు తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మాస్క్ ల విషయంలో పెద్దగా పట్టించుకోని సర్కార్ ముందు జాగ్త్రత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తెలంగాణాలో పెద్దగా కేసులు నమోదు కాకపోయినా కరొనను పూర్తిస్థాయిలో నిర్ములించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తాజాగా రోజుకు 20 నుండి 25 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరు తప్పనిసరి మాస్క్ లు ధరించాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈసందర్బంగా ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…కరోనా ఫోర్త్ వేవ్ పై వస్తున్నా వదంతులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. యాంటీబాడీస్ ప్రజల్లో 93 శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకనుండి కూడా ప్రజలందరూ మాస్క్ లు తప్పనిసరి వాడాలని కోరారు. మాస్క్ లేకుండా రోడ్లపైకి వస్తే రూ. 1000 జరిమానా విధించడం జరుగుతుందని అయన తెలిపారు.