Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాష్ట్రవ్యాప్తంగా 415, సర్పంచ్ లు 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం?

రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలు నామినేషన్లు దాఖలు కాలేదు మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికంగా ప్రకటించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీ లకు, 38,322 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,584 మంది, వార్డు సభ్యుల బరి నుంచి 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 810 మంది సర్పంచ్‌లు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది. మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగనుంది.

RSS
Follow by Email
Latest news