Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గుడి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందజేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

గ్రేటర్ వరంగల్ 17 డివిజన్ పరిధిలోని బొల్లికుంటలో గుడి నిర్మాణానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోల్తి కిరణ్ గౌడ్ 25116 రూపాయల విరాళాన్ని అందజేశారు. శ్రీ కోదండరామ రజక సంఘం ఆధ్వర్యంలో వారి కుల దేవుడు మాడెలయ్యా గుడి నిర్మాణం చేయనున్నారు. అందులో భాగంగా గ్రామ రజక సంఘం అధ్యక్షులు కందుల సారంగం ఆధ్వర్యంలో కుల సంఘం పెద్దలు నిధుల సేకరణకు పలువురిని కలిశారు.
ఈ క్రమంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోల్తి కిరణ్ ఇంటి వద్దకి వెళ్లారు. వెంటనే స్పందించిన కిరణ్ రజక సంఘం పెద్దల సమక్షంలో రూ.25116 అక్షరాల ఇరువది ఐదు వేల నూట పదహారు రూపాయల చందా రాశారు. ఈ సందర్బంగా కిరణ్  మాట్లాడుతూ రజక సంఘం పెద్దలు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రామ అభివృద్ధి, సంసృతి సంప్రదాయాలకు తన వంతు కృషి, సహకారం ఉంటుందని కిరణ్ గౌడ్ తెలిపారు
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు కందుల సారంగం, గట్టుకొప్పుల ప్రసాద్,పాశం.వెంకన్న,కందుల.పెద్ద రాజు,గట్టికొప్పుల.సాలయ్య, గంగారాజు, ఎల్లయ్య,రాజేష్,కందుల.రాహుల్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు
RSS
Follow by Email
Latest news