భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఒప్పందం చేసుకున్నారు . 300 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్‌లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భారతదేశ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా చేసుకున్నారు . ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ ప్రాజెక్టును అమెరికా చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది అమెరికన్ కార్మికులు, ఇంధన వృద్ధి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు భారీ విజయం అని అభివర్ణించారు.
ట్రంప్ ప్రకటన ప్రకారం.. ఈ ప్రాజెక్టు దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించడానికి ఓ ముఖ్యమైన ఒక దశగా ఉంటుంది. బ్రౌన్స్‌విల్లే నౌకాశ్రయంలో ఉనికిలో ఉండే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ ఈ రిఫైనరీను అభివృద్ధి చేస్తుంది. ట్రంప్ ఈ ప్రాజెక్టును ఆర్థిక, వ్యూహాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. అయితే, పెట్టుబడి నిర్మాణం, ఖర్చులు లేదా ఆర్థిక వివరాలపై ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.











