Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మరింత తీవ్రరూపం దాల్చనున్న యుద్ధం.. భూతల యుద్దానికి సై…

మధ్యప్రాచ్యంలో భూతల యుద్దానికి అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో… ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భూతల యుద్దానికి సైతం మిము సిద్దంగానే ఉన్నాము అని అంతే ఘాటుగా స్పందించింది . మీరు “ఇంకా దగ్గరికి వచ్చేయండి, మేం మీకోసమే ఎదురుచూస్తున్నాం” అంటూ అమెరికా సైన్యాన్ని సవాలు చేస్తూ ఇరాన్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుంది.

మంగళవారం నాడు ఇరాన్ ప్రెస్ టీవీ 59 సెకన్ల ఈ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఇరాన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధతతో శిక్షణ పొందుతున్న దృశ్యాలున్నాయి. క్షిపణులను ప్రయోగించడం, లక్ష్యాలు పేలిపోవడం వంటి సన్నివేశాలతో పాటు, అమెరికా సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆ వీడియోలో అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అదనపు బలగాలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది. సుమారు 3,500 మంది మెరైన్లు, సైనికులతో కూడిన భారీ యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి కూడా సెంట్‌కామ్ పరిధిలోకి ప్రవేశించింది. అమెరికా తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుతున్న తరుణంలో ఇరాన్ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. అదే సమయంలో, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.

అయితే, ఈ సైనిక మోహరింపులపై వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గరిష్ఠ వ్యూహాత్మక సౌలభ్యం కల్పించేందుకే ఈ చర్యలని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. కమాండర్-ఇన్-చీఫ్‌కు అన్ని అవకాశాలను అందుబాటులో ఉంచడం పెంటగాన్ బాధ్యత అని ఆమె అన్నారు. అదే సమయంలో, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాలు ఒకవైపు సైనిక బలగాలను ప్రదర్శిస్తూనే, మరోవైపు చర్చల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

RSS
Follow by Email
Latest news