Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ (ఇంధన) నిల్వలు పుష్కలంగా ఉన్నాయి :

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై ప్రల్లో ఆందోళనలు నెలకొన్నాయి.  హైదరాబాద్ పరిధిలో కొన్ని బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డు లు కనిపించాయి. దింతో ప్రజలు ఒక్కసారిగ ఆందోళనలకు గురైయ్యారు. పెట్రోల్ బ్యాంకుల వద్ద బారులు తీరారు. దీనిపై స్పందించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరాజయాలు ఆందోళన చెందవద్దని సూచించారు.

పెట్రోల్ మరియు డీజీల్ (ఇంధన) నిల్వలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు.  దీనిపై వస్తున్న దంతులను నమ్మవద్దని అయన కోరారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి కొరత లేదని అయన తెలిపారు. సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.

కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని సీపీ హెచ్చరించారు. “ప్రజలు శాంతంగా ఉండాలి. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవు, కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు .”

RSS
Follow by Email
Latest news