Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మంత్రి పొంగులేటి సంస్థపై సీఐడీ కి ఆదేశిన రేవంత్ సర్కార్

అక్రమ మైనింగ్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థపై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సొంత కేబినెట్ లోని కీలక మంత్రికి చెందిన కంపెనీపై విచారణకు ఆదేశించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదైమైనా ఈ కేసుతో రేవంత్ రెండు ప్రయోజనాలు పొందుతారు. ఒకటి సొంత మంత్రిపై విచారణ చేయిస్తున్నారన్న పేరుతో ప్రతిపక్షాల నోరు మూయించ వచ్చు. రెండు పొంగులేటి ఇక గ్రిప్ దాటిపోకుండా ఉండటం.

రాఘవ కన్ స్ట్రక్షన్స్ పై ఇటీవలి కాలంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి.హైదరాబాద్‌ శివారుతో పాటు ఖమ్మం జిల్లాలోనూ భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ సాగించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్న ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణకు ఆదేశించడంతో మంత్రి పొంగులేటి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ విచారణలో అక్రమాలు రుజువైతే, అది కేవలం కంపెనీకే కాకుండా మంత్రి పదవికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సీఐడీ సమర్పించే నివేదిక తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిప్పుతుందొ కాలమే నిర్ణయించాలి.

RSS
Follow by Email
Latest news