Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సాన యాదిరెడ్డి కాంబినేషన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం   ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్బంగా షూటింగ్ లో హీరో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటి సమీపంలో గాయమయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు ఆందోళన చెందారు. చరణ్‌కు తగిలింది చాలా స్వల్ప గాయమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆయన రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది.

RSS
Follow by Email
Latest news