రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 27 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు యశస్వి, వైభవ్ల మెరుపులతో 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూపర్ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (77 నాటౌట్; 32 బంతుల్లో 10×4, 4×6), వైభవ్ సూర్యవంశీ (39; 14 బంతుల్లో 1×4, 5×6) మరో విజయాన్ని అందించారు. లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 9 వికెట్ల నష్టానికి కేవలం 123 పరుగులు చేసి ఓటమిపాలైంది.
రాజస్థాన్ బౌలర్ ఆర్చర్ తొలి ఓవర్లోనే రికెల్టన్ (8)ను ఔట్ చేసినజట్టుకు శుభారంభాన్నందించ్చారు. సూర్యకుమార్ (6)ను తక్కువ స్కోరుకే బర్గర్ అవుట్ చేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (5) సందీప్ శర్మ బౌలింగ్లో ఔటైపోయారు. హార్దిక్ పాండ్య (9), తిలక్ వర్మ (14)లను ఒకే ఓవర్లో రవి బిష్ణోయ్ ఔట్ చేసి ముంబయి ఓటమిని ఖాయం చేశాడు. తర్వాత వచ్చిన షెర్ఫానీ రూథర్ఫర్డ్ (25; 8 బంతుల్లో 2×4, 2×6), నమన్ ధీర్ (25; 13 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు.
రాజస్థాన్ ఇన్నింగ్స్: యశస్వి నాటౌట్ 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దూల్ 39; జురెల్ ఎల్బీ (బి) ఘజన్ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 20; హెట్మయర్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150;
వికెట్ల పతనం: 1-80, 2-84, 3-121; ముంబై బౌలింగ్: దీపక్ 1-0-22-0; బుమ్రా 3-0-32-0; బౌల్ట్ 1-0-22-0; హార్దిక్ 2-0-17-0; శార్దూల్ 2-0-36-1; ఘజన్ఫర్ 2-0-21-2
ముంబయి ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ ఎల్బీ (బి) సందీప్ శర్మ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ వర్మ (సి) హెట్మయర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ ధీర్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్ఫర్డ్ (సి) సందీప్ శర్మ (బి) తుషార్ 25; శార్దూల్ (సి) జురెల్ (బి) సందీప్ శర్మ 8; దీపక్ చాహర్ నాటౌట్ 6; బౌల్ట్ రనౌట్ 1; బుమ్రా నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123;
వికెట్ల పతనం: 1-10, 2-20, 3-22, 4-41, 5-46, 6-93, 7-103, 8-111, 9-116; రాజస్థాన్ బౌలింగ్: ఆర్చర్ 2-0-17-1; బర్గర్ 2-0-21-2; సందీప్ శర్మ 3-0-26-2; తుషార్ దేశ్పాండే 2-0-29-1; రవి బిష్ణోయ్ 2-0-25-2











