Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాజస్థాన్‌ రాయల్స్ V/S చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌లో ఈరోజు (సోమవారం) సాయంత్రం 7:30 గంటకి జరగనున్న తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. గత ఐపీఎల్‌ సీజన్ లో ఇప్పటిదాకా రాజస్థాన్‌కు ఆడిన సంజు శాంసన్‌ చెన్నైకి, చాలా ఏళ్లు చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు మారిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఈ ఇద్దరినీ పరస్పరం భిన్న రంగు దుస్తుల్లో చూడబోతున్నాం. ఇప్పటిదాకా సంజు శాంసన్‌ అనగానే గులాబి రంగు జెర్సీ, రవీంద్ర జడేజా పసుపు రంగు జెర్సీలో కనపడేవారు.

అయిదు సార్లు ఛాంపియన్‌ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో పదో స్థానంలో నిలిచింది. ఒకప్పటిలా ఐపీల్ లో తమ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. కానీ ధోని.. పిక్క గాయంతో రెండు వారాలు టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు ప్రతికూలాంశమే. దీంతో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై భారం పడనుంది. శాంసన్, గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. ఇక దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుండడం చెన్నైకి ప్రతికూలాంశమే.

ఫామ్‌లో ఉన్న భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే, ఉర్విల్‌ పటేల్, శివమ్‌ దూబెలతో చెన్నై సూపర్ కింగ్స్  బ్యాటింగ్‌ విభాగం బలంగానే ఉంది. కానీ ఆ జట్టు బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. దేశవాళీల్లో సత్తాచాటిన కొత్త కుర్రాళ్లు ప్రశాంత్‌ వీర్, కార్తీక్‌ శర్మ బ్యాటింగ్ లో ఈమేరకు రాణిస్తారో చూడాలి. ఇక బౌలింగ్ లో ఖలీల్‌ అహ్మద్, నూర్‌ అహ్మద్, మ్యాట్‌ హెన్రీ, రాహుల్‌ చాహర్, ముకేశ్‌ చౌదరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

ఇకపోతే గత ఐపీల్ లో పేలవ ప్రదర్శన చేసిన రాజస్థాన్‌.. ఈసారి పుంజుకోవాలని చూస్తోంది. రియాన్‌ పరాగ్‌ నేతృత్వంలోని జట్టు యశస్వి జైశ్వాల్, యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆ జట్టుకు కొండంత అండగా ఉన్నారు. పరాగ్, ధ్రువ్‌ జురెల్‌ లు  నిలకడ లేమి సమస్యతో ఉన్నారు. మిడిలార్డర్‌లో హెట్‌మయర్‌ కీలకం. ఫామ్‌ కోల్పోయిన జడేజా.. ఫామ్ అందిపుహుకుంటారో  చూడాలి. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌లు ఈమేరకు రాణిస్తారనే దానిపై ఆ జట్టు భవితవ్యం తేలనుంది.

RSS
Follow by Email
Latest news