Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గుజరాత్‌ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ :

పంజాబ్ కింగ్స్ తమ ఐపీఎల్ 2026 ను విక్టరీతో ప్రారంభించింది. ఆస్ట్రేలియా యువ సంచలనం, అరంగేట్రం ఆటగాడు కూపర్ కానోలీ (72 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయినా కూడా… కూపర్ కనోలీ మాత్రం పట్టువిడవలేదు.  ఓవైపు తనకు సహకారం అందించే బ్యాటర్‌ కరవైనా ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. చివరి వరకూ అజేయంగా నిలిచి తమ జట్టును గెలిపించాడు. కూపర్ కానోలీ 44 బంతుల్లో 72 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) మంచి ఆరంభాన్ని అందించారు.  కానీ మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని కట్టడి చేశారు. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ విజయకుమార్ వైశాఖ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. యజ్వేంద్ర చాహల్ 2 వికెట్లతో, మార్కో జాన్సెన్ ఒక వికెట్‌తో గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు కానోలీ రూపంలో ఆదుకున్నాడు. అయితే, ఒక దశలో 110/2తో పటిష్టంగా ఉన్న పంజాబ్, గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ మెరుపు బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్‌ బ్యాటింగ్ వెన్ను విరిశాడు. అయన ధాటికి శ్రేయాస్ అయ్యర్ (18), నేహల్ వధేరా (3), శశాంక్ సింగ్ (4), మార్కస్ స్టోయినిస్ (0) వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ 118/6 వద్ద కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ తన స్పెల్‌లో 3 వికెట్లు తీసి గుజరాత్‌ టైటాన్స్ గెలుపు పై ఆశలు కల్పించాడు.

ఆఖరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమైన తరుణంలో, జేవియర్ బార్ట్లెట్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. 19వ ఓవర్లో 14 పరుగులు రావడంతో సమీకరణం 6 బంతుల్లో 2 పరుగులుగా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతినే కానోలీ ఫోర్‌గా మలిచి 165 పరుగులతో పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది.

RSS
Follow by Email
Latest news