మెగాస్టార్ నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . 9 రోజుల్లో 9 ప్రాంతాల్లో డిఫరెంట్ ప్లానింగ్స్ తో ప్రమోషన్స్ చేపట్టనున్నారు . ఈ రోజు నుంచే మొదలైన ఈ ప్లానింగ్ వరుసగా 11వ తేదీ వరకు సాగుతుంది. రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తాడేపల్లిగూడెం, అనంతపూర్, వరంగల్ లో ప్రమోషన్స్ కార్యకమం కొనసాగనుంది . చివరిగా బెంగళూరు ప్రాంతాల్లో కూడా జరగనుంది . మొత్తం ఈనెల 3 నుంచి 11 వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుంది .

ఈ సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి రారు అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. చిరంజీవి హాజరు అవుతుండగా ఈ సినిమా కోసం ఎప్పుడూ ప్రమోషన్స్ ఈవెంట్స్ కి కూడా హాజరు కానీ నయనతార కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వస్తున్నారు.











