హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది.
‘‘అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణలు, ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా ఇరాన్ నిలిపివేసింది’’ అంటూ టెహ్రాన్ టైమ్స్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. శాంతి చర్చల్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణను అమెరికా ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను ఇప్పటికే ఇరాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) ముగియనుంది. ఆ తరువాత పరిణామాలు ఎలా జరగనున్నాయో చూద్దాం.











