ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. ఈ సినిమా పార్ట్ – 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కానీ ఈ సినిమా కు తాజాగా కొత్త చిక్కు వచ్చి పడింది. పాకిస్థాన్లో ఇండియన్ స్పై చేసిన ఆపరేషన్ గురించి ఈ సినిమా అంతా చూపిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా కరాచీలోని ల్యారీ నగరం నేపథ్యంలో తీర్చిదిద్దడం గమనార్హం. ఆ ల్యారీ నగరం ద్వారానే సినిమా అంతా చూపబడుతోంది. అక్కడి ఉగ్రమూలాలను పూర్తిగా పెకలించడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ ధురంధర్ ను అప్పుడు భారత్ చేపట్టింది.
ఈ నేపథ్యంలో తెరకెక్కిన ధురంధర్ చిత్రాలు విజయవంతమైన నేపథ్యంలో పార్ట్ – 1 రూ.2000 కోట్ల లాభాలను గడించింది. పార్ట్ – 2 విడుదలైన దగ్గర నుంచి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా వాసులు చేస్తున్న ఆదాయంలో కొంత మొత్తం తమకు ఇవ్వాలని ల్యారీ ప్రజలు కోరుతున్నారు. ల్యారీ పేరును వాడుకున్నందుకు మా ప్రాంతానికి కూడా ఆర్థికంగా ప్రయోజనం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రం వసూలు చేస్తున్న వందల కోట్లలో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి కేటాయించాలని వారు అంటున్నారు.











