ఏ వయసులో ఎక్సర్‌సైజ్‌లు మొదలు పెట్టినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్ల వయసులో రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి బ్లడ్ షుగర్ లెవల్స్, గట్ హెల్త్ మెరుగ్గా ఉంటాయని సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి.
చాలా రకాల ఆరోగ్య సమస్యలు సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతోనే వస్తాయి. ఏ వయసులో ఎక్సర్‌సైజ్‌లు మొదలు పెట్టినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్ల వయసులో రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి బ్లడ్ షుగర్ లెవల్స్, గట్ హెల్త్ మెరుగ్గా ఉంటాయని సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. ఈ రోజు పాటించే చిన్న అలవాటు ఓ 5 నుంచి 10 ఏళ్ల తర్వాత శరీర ఆరోగ్య స్థితిని డిసైడ్ చేస్తుందని స్పష్టం చేస్తున్నాయి. మరి వాకింగ్ వల్ల నిజంగానే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందా? బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేయడంలో దీని పాత్రేంటో నిపుణులు వివరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ నివారణకు 30 మినిట్స్ సరిపోతాయా? డయాబెటిస్ నివారణకు 30 మినిట్స్ సరిపోతాయి. వారంలో చాలా రోజుల సుమారు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి మోస్తరు తీవ్రతతో కూడిన ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుంది. అయితే, క్రమం తప్పకుండ నడకపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్‌లో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. అయితే, వాకింగ్‌తో పాటు డైట్ ఛేంజ్ చేసుకోవడం, ప్రాసెస్ ఫుడ్ ని కంట్రోల్ చేయడం, తగినంత నిద్రపోవడం, అలాగే లైఫ్‌స్టైల్ కొద్దిపాటి మార్పులు చేసుకోవడం మంచిది. దింతో డయాబెటిస్ రివర్స్ కూడా చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వయసులో ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చాలా మందిలో మెటబాలిజంలో మార్పులు వస్తున్నాయి. ఇవి క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని, గ్లూకోజ్ లెవల్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. కింగ్ తోపాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, రక్తంలోని గ్లూకోజ్‌ని శరీరం సమర్థంగా వాడుకునేలా చేస్తుంది. నడిచేటప్పుడు కండరాలు చురకుగా మారి శక్తి కోసం బ్లడ్ స్ట్రీమ్‌లోని గ్లూకోజ్‌ని గ్రహిస్తాయి. దీంతో, బ్లడ్‌లో షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది.
భోజనం తర్వాత కాస్త నడవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండటం వెనుక ఉన్న రహస్యం ఇదే. రెగ్యులర్‌గా నడిస్తే శరీర కణాలు ఇన్సులిన్‌కు మెరుగ్గా స్పందిస్తాయి. తద్వారా, గ్లూకోజ్ రక్తప్రవాహంలో నిలిచిపోకుండా మరింత సమర్థంగా పనికొస్తుంది. ఫ్యామిలీలో డయాబెటిస్ హిస్టరీ ఉన్నవారికి, బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చే ఛాన్స్ ఉన్నవారికి ఈ సాధారణ అలవాటు ఎంతో కీలకంగా పనిచేస్తుంది.











