Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌

దేశీయ స్టాక్ మార్కెట్‌ లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,565.22 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,583.22) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 488.20 పాయింట్ల నష్టంతో 22,331.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 71,774.13 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ..  చివరికి 1635.67 పాయింట్ల నష్టంతో 71,947.55 వద్ద స్థిరపడింది. టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ స్టాక్స్‌ లాభాల్లో కొనసాగగా, మిగిలిన స్టాక్స్‌ నష్టాల్లో ముగిశాయి.

ప్రధానంగా….  బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఇండిగో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్స్‌  నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 115 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజున మార్కెట్ లు నష్టాల్లో ముగిశాయి. మహవీర్ జయంతి సందర్భంగా రేపు (మార్చి 31) స్టాక్‌ మార్కెట్ లకు సెలవు.

డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ఇరాన్‌పై భూతల దాడులకు సిద్ధమవుతుందన్న వార్తలు వెలువడుతున్నయి. ఈ క్రమంలో తాము కూడా వారి రాకకోసం ఎదురు చూస్తున్నాయని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌ పేర్కొన్నారు. అమెరికా దళాలు అడుగుపెట్టగానే వారిని బూడిద చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత తీవ్రం కావొచ్చన్న భయాలు నెలకొంటున్నాయి.

 

RSS
Follow by Email
Latest news