Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభం

అల్లు కుటుంబానికి చెందిన మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ను కోకాపేటలో నిర్మించారు . దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈరోజు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ తదితరులతో కలిసి రేవంత్ రెడ్డి మల్టీప్లెక్స్‌ను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ను అల్లు సినిమాస్‌లో ప్రదర్శించారు. రేవంత్ రెడ్డికి ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు ఉప సీఎం మల్లు భట్టివిక్రమార్క కూర్చున్నారు. భట్టివిక్రమార్క పక్కన అల్లు అరవింద్ కూర్చుని ఈ విజువల్స్‌ను వీక్షించారు.

ఈరోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌లో ఉగాది సందర్భంగా ఈ నెల 19 నుంచి సినిమాలు ప్రదర్శించనున్నారని సమాచారం. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్‌గా అల్లు సినిమాస్ రూపొందింది. ఇందులో నాలుగు స్క్రీన్‌లు ఉండగా, స్క్రీన్ 1లో డాల్బీ విజన్ ఉంది. రేపటి నుంచి బుక్ మై షో ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. తొలుత ధురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి.

RSS
Follow by Email
Latest news