Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు : పోతన చారి

డిసెంబర్ 4న ఘంటసాల జయంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి మిరా కల్చరల్ సొసైటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సంస్థ ఆర్గనైజర్ కర్ణకంటి పోతన చారి తెలిపారు. కార్యక్రమానికి ముందుగా ఘంటసాల గారి చిత్ర పటానికి కళాశేఖర్ రావు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే గాయని గాయకులు అందరు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కర్ణకంటి పోతన చారి మాట్లాడుతూ… స్వర సామ్రాట్ కళా ప్రపూర్ణ డాక్టర్ శరత్ చంద్ర గారి ఆశీస్సులతో సంగీత బ్రహ్మ ప్రొఫెసర్ వి తిరుపతయ్య గారి సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అయన వివరించారు .

ఈ రోజున అనగా డిసెంబర్ 4న గానగంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా సరిగమప సంగీత లహరి సినీ గీతాలాపన కార్యక్రమం శ్రీ సాయి మీరా కళాక్షేత్రంలో నిర్వహించినట్లు అయన తెలిపారు .  అలాగే లెజెండర్ నటశేఖర కృష్ణ గారి మూడవ వర్ధంతి సందర్భంగా నవంబర్ 15న ఆయన నటించిన చిత్రాల్లోని  పాటలను గాయని గాయకులు ఆలపించారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినట్లు చారి వివరించారు.

డిసెంబర్ 2024 నుండి డిసెంబర్ 2025 సంవత్సరము వరకు శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ వర్క్ షాప్ లో నిర్వహించినటువంటి సంగీత సాహిత్య కార్యక్రమాలు దాదాపుగా 30 నుండి 35 వరకు ప్రోగ్రాములు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నెలవారి కార్యక్రమంలో భాగంగా విశ్వంభర కవి సమ్మేళనాలు నిర్వహించాము. ఒకే సంవత్సరంలో చాలా బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహించటము ఎవరికి సాధ్యం కాదు అని ఇంకా సంగీత బ్రహ్మ విశ్రాంత ఆచార్య ప్రొఫెసర్ వీ తిరుపతయ్య గారు తెలిపారు. శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ ఫౌండర్ ఆర్గనైజర్ కర్ణ కంటి పోతన చారి ఈ వర్క్ షాప్ నిర్వహించటము చాలా సంతోషకరం అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో సంస్థ ఆధ్వర్యంలో గాయని గాయకులకు ప్రశంసాపత్రం తోపాటు మెమొంటోలు ఇచ్చి వారిని సత్కరించారు .

ఈ కార్యక్రమానికి విశ్వకవి మహమ్మద్ సిరాజుద్దీన్, అన్వర్, కళాశేఖర్ రావు ముఖ్య అతిథులుగా హాజరైనారు. కార్యక్రమంలో గాయని గాయకులైన నల్ల లక్ష్మీనారాయణ, బన్న ప్రభాకర్, బాబురావు, గబ్బెట సుధాకర్, రామేశ్వర చారి, lic జగదీశ్వర్, లయన్ ఉపేందర్, ఎం కే మూర్తి, పులచంద్ర ప్రభాకర్, డి ఎస్ నందు, శోభన్, ఎర్ర ప్రసూన, వాణిశ్రీ, పద్మావతి, మాధవి, రేణుక, నీరజ, తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news