నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో నిన్న రాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తోపాటు కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. దింతో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇక సంజామల వద్ద పాలేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. పాలేరు వాగు వంతెన పై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. తిమ్మనైనపేట నుండి కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సు వంతెన పైనుండి వాగులోకి ఒకవైపు ఒరిగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు.
సమాచారం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు బస్సులోని ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అప్పటికి బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాగు వద్ద ఎవరిని దాటకుండ రక్షణ ఏర్పాటు
చేశారు. పాలేరు వాగు వంతెన పై నీరు భావిస్తుండడంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.