ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాని పోయిన ఓ పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని, మైలార్ దేవుపల్లి డివిజన్, బాబుల్ రెడ్డి నగర్ లో సోమవారం ఉదయం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు కూలీలు వలస వచ్చి, స్థానికంగా ఉన్న పారిశ్రామిక వాడలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ ప్రమాదంలో 8 సంవత్సరాల ఓ బాలుడు, 3 సంవత్సరాల ఓ బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీఐ మధు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన చిన్నారులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.