బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. ‘స్కాంగ్రేస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఈవో వికాస్ రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరవై నాలుగు గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాము చేసిన పనులు… చేయబోయే పనులు.. అలాగే విపక్షాల ప్రభుత్వాలు అవినీతిమయం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వదులుతున్నాయి. స్కాంగ్రేస్’ అంటూ బీఆర్ఎస్ ప్రకటనలు ఇవ్వడంపై ఈసీ తాజాగా నోటీసులు ఇచ్చింది.